![]() |
![]() |

సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే గత వారం కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. లాస్ట్ వీక్ షోకి బ్రహ్మాజీ, కళ్యాణ్ రామ్, ఆషిక వచ్చారు. ఇక సుమ వీళ్ళతో చెడుగుడు ఆడేసింది. ప్రోగ్రాంకి వచ్చిన స్టూడెంట్స్ కి కొంటె ప్రశ్నలు అడిగి వాళ్లకు బ్రహ్మాజీ, కళ్యాణ్ రామ్ సైన్ చేసి ఇచ్చిన టోపీలు, టీ షర్టులు ఇచ్చింది. ఇక తర్వాత కళ్యాణ్ రామ్ చేతి మీద "స్వాతి" అనే టాటూ చూసి చాలా బాగుంది అని అనేసరికి బ్యాక్ స్క్రీన్ మీద కళ్యాణ్ రామ్ ది ఒక ఓల్డ్ పిక్ చూపించారు. చేతి మీద టాటూ వేయించుకోవడం వెనక ఉన్న కథ ఏమిటి అని సుమ అడిగేసరికి..కళ్యాణ్ రామ్ చాలా విషయాలు చెప్పాడు. " మా పెళ్ళైన రెండు మూడేళ్ళ తర్వాత నేను చెప్పుకోలేని ఒక అనారోగ్యంతో చాలా బాధపడ్డాను. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల వరకు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. ఈ విషయం బయట ఎవరికీ కూడా తెలియదు. అప్పుడు వచ్చిన నా అనారోగ్యం ఎలాంటిది అంటే కచ్చితంగా నా పక్కన ఒక మనిషి ఉండాల్సిందే..అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నా భార్య స్వాతి నా బాధను తన బాధలాగా ఫీల్ అయ్యింది. ఆ టైములో నన్ను తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది. తనకు నేను ఏమివ్వగలను.
ఇప్పుడంటే సిక్స్ ప్యాక్ బాడీ వచ్చింది...సినిమాలు చేస్తున్నా.. బాగా రికవరీ అయ్యాను. అంతా తనవల్లనే కదా. అప్పుడు తనకు నేను ఏదైనా చేయాలి అనిపించింది. టెన్త్ యానివర్సరీ టైములో నేను ఏం కావాలి అని స్వాతిని అడిగాను. తనకేమీ వద్దు కావాల్సినవన్నీ ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు నాకు సూదులంటే భయం. అది గుచ్చుకుంటే వచ్చే నొప్పిని భరించలేను. అప్పుడు అనిపించింది నాకు తాను నా బాధను ఎలా ఐతే భరించిందో...నేను కూడా అలా సూదులతో పొడిపించుకుని టాటూ వేయించుని తన బాధను నేను కూడా భరించాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే టెన్త్ యానివర్సరీకి ఆమెకు గిఫ్ట్ గా తన పేరును నా చేతి మీద పచ్చబొట్టుగా వేయించుకున్నా" అని చెప్పాడు. ఇక సుమ కూడా ఇదే విషయాన్ని బ్రహ్మాజిని అడిగింది "మీ ఆవిడ పేరును మీరు పచ్చబొట్టుగా వేయించుకోలేదా అని" "నా పేరునే మా ఆవిడ ఎక్కడంటే అక్కడ పొడిపించుకుంది ఇలాంటి దేవుడు మళ్ళీ దొరకడు" అని చెప్పాడు నవ్వించాడు బ్రహ్మాజీ.
![]() |
![]() |